: ఎప్పుడూ పురుషులకే ఎందుకీ కష్టం?: సుప్రీంకోర్టు


వివాహ సంబంధ వివాదాల పరిష్కారం కోసం దంపతులు కోర్టును ఆశ్రయించినప్పుడు సాధారణంగా మహిళ ఉండే చోటుకు సమీపంలోని న్యాయస్థానానికి కేసు విచారణను బదిలీ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇకపై అలా జరగబోదని, కేసు బదిలీ విషయంలో పురుషులకూ హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఏ.కే.సిక్రీ లతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "భర్తలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను తామున్న చోటకు బదిలీ చేయాలని భార్యలు కోరితే ఎన్నోసార్లు అంగీకరించాము. అయితే, ఇక్కడ భర్తలకూ కొన్ని హక్కులు ఉంటాయి. కేసుల బదిలీల విషయంలో ఎప్పుడూ పురుషులే ఎందుకు కష్టపడాలి?" అని ప్రశ్నించింది. ఓ కేసును ఘజయాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని బేతుల్ కు మార్చేందుకు బెంచ్ నిరాకరించింది.

  • Loading...

More Telugu News