: సిరిసేనకు ప్రధాని మోదీ అభినందనలు
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గురువారం నాడు పోలింగ్ జరగ్గా, కౌంటింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ లో ఆది నుంచి రాజపక్సపై సిరిసేన ఆధిక్యతను సాధిస్తూ వస్తున్నారు. దీంతో, కౌంటింగ్ ముగియకుండానే రాజపక్స తన ఓటమిని అంగీకరిస్తూ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ సిరిసేనకు అభినందనలు తెలుపుతూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టింగ్ లు పెట్టారు.