: అర్ధరాత్రి వరకు ఆసుపత్రిలోనే గడిపిన జగన్


అనంతపురం జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని వైకాపా అధినేత జగన్ పరామర్శించారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆయన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే గడిపారు. చికిత్స పొందుతున్న ఒక్కొక్కరిని పలుకరిస్తూ, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ స్థానిక నేత నవీన్ నిశ్చల్ బాధితులకు అండగా ఉంటారని, సహాయ సహకారాలను అందిస్తారని తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన... మావటూరు, చెరుకూరు తదితర గ్రామాలను సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.

  • Loading...

More Telugu News