: భారత్ ఆలౌట్... సెకండ్ ఇన్నింగ్స్ ఆదిలోనే ఆసీస్ వికెట్ డౌన్!


నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ కోహ్లీ వికెట్ కోల్పోయిన భారత జట్టులో వికెట్ల పతనం మొదలైంది. 475 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. దీంతో 97 పరుగుల ఫాలో ఆన్ లో పడిపోయింది. వెనువెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు భారత బౌలర్లు షాకిచ్చారు. తన తొలి ఓవర్ లోనే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్ స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్(4) ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ ఓవర్ లో మూడో బంతిని ఆడబోయిన వార్నర్ మురళీ విజయ్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో నాలుగు ఓవర్లో ఓ వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. క్రిస్ రోజర్స్ (12), షేన్ వాట్సన్ (8) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News