: రాజపక్స ఓటమి... లంక కొత్త అధ్యక్షుడిగా సిరిసేన ఎన్నిక!
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నేటి ఉదయం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో సిరిసేన విజయపథంలో దూసుకెళుతున్నారు. సిరిసేన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు మహీంద రాజపక్స భారీ స్థాయి తేడాతో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమిని అంగీకరిస్తూ రాజపక్స అధ్యక్ష భవనాన్ని విడిచి వెళ్లారు. దీంతో లంక కొత్త అధ్యక్షుడిగా సిరిసేన దాదాపుగా ఎన్నికైనట్లే. నేటి సాయంత్రం సిరిసేన లంక కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.