: మారిన ఇన్ఫోసిస్ వైఖరి!
ఆర్థిక ఫలితాల వెల్లడి రోజున స్టాక్ మార్కెట్ మొత్తాన్ని శాసించే శక్తి ఉన్న కంపెనీగా ముద్రపడ్డ ఇన్ఫోసిస్ వైఖరి మారింది. ప్రతి మూడు నెలలకూ ఒకసారి ఉదయం 9 గంటల లోపే త్రైమాసిక ఫలితాలు ప్రకటించే ఇన్ఫీ ఇకపై మధ్యాహ్నం తరువాత ఫలితాలు వెల్లడించనుంది. భారత స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందే వెల్లడయ్యే రిజల్ట్స్ ఈసారి మధ్యాహ్నం 12:30 గంటలకు బయటకు రానున్నాయి. యూరోప్ మార్కెట్ మొదలయ్యే సమయానికి ఫలితాలు వెల్లడిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, నేడు విడుదలయ్యే ఇన్ఫీ రిజల్ట్స్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.