: మూడు దశాబ్దాల తరువాత... ఒబామా ముందు 'పవర్' చూపాలని మోదీ సర్కార్ నిర్ణయం!
సుమారు మూడు దశాబ్దాల తరువాత పూర్తి స్థాయి ఆయుధ పాటవాన్ని ప్రదర్శించేందుకు భారత్ సిద్ధమవుతోంది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకూ ప్రదర్శించని అత్యాధునిక ఆయుధాలను, యుద్ధ విమానాలను పరేడ్ చేయించాలని కేంద్రం నిర్ణయించింది. ఫైటర్ జెట్లు, గూఢచార విమానాలను చూపించాలని భారత నౌకాదళం నిశ్చయించింది. కొత్తగా అమెరికా నుంచి కొనుగోలు చేసిన లాంగ్-రేంజ్ విమానాలు, యాంటీ-సబ్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ లను తొలిసారి ఒబామా ముందు ప్రదర్శనకు రానున్నాయి. శబ్దవేగం కన్నా స్పీడ్ గా వెళ్ళే సూపర్ సోనిక్ జెట్ కూడా తొలిసారి ఢిల్లీ వీధులపై కనిపించనుంది. దీంతో పాటు 150 మంది మహిళా అధికారులు పరేడ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఒక రిపబ్లిక్ పరేడ్ లో మహిళా అధికారులు పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా, 1984లో బ్రిటన్ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్స్ ను అప్పట్లో భారత నౌకాదళం పరేడ్ లో ప్రదర్శించింది. ఢిల్లీ విజయ్ చౌక్ మీదుగా సీ హారియర్ తో అరుణ్ ప్రకాష్ దూసుకువెళ్తే ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు.