: జైలు గేటు దాకా వెళ్లి వెనక్కు తిరిగొచ్చిన సంజయ్ దత్... అధికారుల సీరియస్!


14 రోజుల పెరోల్ అనంతరం నిన్న జైలుకు వెళ్ళాల్సిన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ప్రవర్తన అధికారులకు ఆగ్రహం తెప్పించింది. నిన్న సాయంత్రం జైలుకు వెళుతున్నానని చెప్పి పూణే జైలు గేటు వరకూ వచ్చిన ఆయన సరెండర్ కాకుండా తిరిగి ఇంటిదారి పట్టారు. పెరోల్ పొడిగింపు కోరుతూ సంజయ్ దత్ దరఖాస్తు చేసుకున్నారని, దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోని కారణంగా ఆయన జైలుకు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సంజయ్ తరపు న్యాయవాది హితీష్ జైన్ తెలిపారు. ఇదే విషయమై జిల్లా శాఖ డీఐజీని వివరణ కోరగా, ఆయన అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ సెలవు పొడిగించాలని కోరగా, తాము ముంబై పోలీసులకు విషయం తెలిపి సంజయ్ ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఉదంతంపై జైలు అధికారులు మాత్రం ఒకింత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News