: కోహ్లీ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ క్లోహీ 120వ ఓవర్లో 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్ లో రోజర్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 230 బంతులాడిన కోహ్లీ 20 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం సాహా (28), అశ్విన్ (11) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కాగా, మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.