: అమిత్ షా తొలి పర్యటనకు ఘనస్వాగతం


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలి పర్యటనకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, బలోపేతంలో భాగంగా హైదరాబాదులో పర్యటించి, పదాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన నేటి సాయంత్రం విజయవాడ వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఆయన, రేపు పార్టీ పదాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఏపీ పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News