: రాజమండ్రిలో సంక్రాంతి పాల పోటీలకు విశేష స్పందన
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహిస్తున్న పాల పోటీలకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భారతీయ విద్యాభవన్స్ మైదానంలో ఏర్పాటు చేసిన అఖిల భారత దేశవాళీ ఆవుల అందాలు, పాల పోటీలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న పోటీల్లో రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఆవులు, గిత్తలను రైతులు తీసుకొచ్చారు. ఈ పోటీల్లో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.