: స్విమ్స్ లో చిరుత పులి...పరుగులు తీసిన విద్యార్థులు
చిత్తూరు జిల్లా తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ (స్విమ్స్) సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఆస్పత్రి వెనుక భాగంలో ఆవు, కుక్కలపై దాడి చేసి చంపేసింది. చిరుతపులిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కాగా, చిరుత మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్న స్థానికులు, తమను కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.