: ఐఐఎం భూముల్లో రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఐఐఎంకు కేటాయించిన భూముల్లో రైతులు ధర్నా చేపట్టారు. విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం పరిధిలో ఐఐఎం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి భూములు సేకరించేందుకు, ఐఐఎం శంకుస్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ రోడ్డులో స్థానిక రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే వంటా వార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మరోవైపు ఆర్టీవో కార్యాలయానికి మినహాయింపునివ్వాలని జిల్లా మోటారు ట్రాన్స్ పోర్టు ఓనర్స్ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఐదేళ్ల క్రితం సర్వే నెంబర్ 68లో 23 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్లతో ఆర్టీవో కార్యాలయం నిర్మించారని, అలాంటి కార్యాలయం నిర్మించాలంటే కష్టం కనుక దీనికి మినహాయింపునివ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు.