: ఇక మీరు ఆంధ్రకు వెళ్లిపోవచ్చు: తెలంగాణ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులో భాగంగా తెలంగాణలో పని చేస్తున్న అనేకమంది ఐఏఎస్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏపీలో పని చేస్తున్న పలువురు అధికారులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ గత వారమే తెలంగాణకు కేటాయించిన అధికారులను రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నేడు ఏపీ అధికారులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.