: 'అతి'చేసిన ఆసీస్ బౌలర్... ఐసీసీ మందలింపు
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మందలింపుకు గురయ్యాడు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ విజయ్ వికెట్ స్టార్క్ కే దక్కింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీయడంతో ఈ లెఫ్టార్మ్ పేసర్ అతిగా స్పందించాడు. పెవిలియన్ కు వెళుతున్న విజయ్ ను రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. లెవల్ 1 తప్పిదంగా భావించి స్టార్క్ ను అధికారికంగా మందలిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్టార్క్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో మందలింపుతో సరిపెట్టారు.