: పొదల్లో సూట్ కేస్...అందులో అస్థిపంజరం


నిజామాబాద్ జిల్లాలోని బడాపహాడ్ (పెద్దగుట్ట) లో ఓ సూట్ కేస్ కలకలం రేపింది. బడాపహాడ్ దర్గా సమీపంలోని పొదల్లో సూట్ కేస్ ను స్థానికులు గమనించారు. అందులో ఏముందోనన్న అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాగ్రత్తగా సూట్ కేస్ ను తెరిచారు. సూట్ కేసులో ఓ యువకుడికి చెందిన అస్థిపంజరం బయటపడింది. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ అస్థిపంజరం ఎవరిది? సూట్ కేస్ ను ఎవరు, ఎందుకు, అక్కడ పడేశారు? వంటి విషయాలపై దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News