: నూట పద్దెనిమిది రైళ్లు రద్దు... పొగమంచు ఎఫెక్ట్
ఢిల్లీని పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజధానిని చుట్టుముట్టిన పొగమంచు కారణంగా 118 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. రోడ్డు, రైలు మార్గాల్లో పొగమంచు అలముకుని, దగ్గర్లో ఉండే వస్తువులు, మనుషులు కనపడకపోవడంతో రైల్వే శాఖ వందకుపైగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఢిల్లీ, అమృత్ సర్, గోరఖ్ పూర్, వారణాసి తదితర విమానాశ్రయాల నుంచి బయల్దేరాల్సిన విమాన ప్రయాణ వేళల్లో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది. రైళ్లు, విమానాలు గంటలు, రోజుల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు సర్వీసులు రద్దవుతున్నాయి.