: పాఠ్య ప్రణాళికలో భగవద్గీత... హర్యానా సర్కారు యోచన
హర్యానాలోని బీజేపీ సర్కారు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని యోచిస్తోంది. దీనిపై చర్చించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్ విలాస్ శర్మ తెలిపారు. ఇందుకోసం విద్యారంగ నిపుణులతో ఓ కమిటీ వేస్తామని చెప్పారు. పాఠ్య ప్రణాళికలో భగవద్గీత అంశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నామని అన్నారు. తమ ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, ఇస్లాం మత సంస్థ దారుల్ ఉలూమ్ కూడా సానుకూలంగా స్పందించిందని మంత్రి అన్నారు. మద్దతుగా ప్రపంచం నలుమూలల నుంచి వేలాది సందేశాలు వస్తున్నాయని తెలిపారు. తాము నియమించబోయే కమిటీ అన్ని విషయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.