: కూడంకుళం నుంచి రాష్ట్రానికి యాభై మెగావాట్ల విద్యుత్ : ఎంపీ కంభంపాటి


కూడంకుళం విద్యుత్ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు 50 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నారని టీడీపీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లేఖ పంపారని చెప్పారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్యాస్, థర్మల్ విద్యుదుత్పత్తికి సంబంధించి కోల్ లింకేజీని పెంచాలని కోరామన్నారు. ఈనెల 12న ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారని వెల్లడించారు. జపాన్, సింగపూర్ ప్రతినిధులతో చర్చల తరువాత ఏపీ రాజధాని విషయంలో స్పష్టత వస్తుందన్నారు. పుట్టపర్తి విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని విమానయాన శాఖను కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఈ నెల 15న కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళతారని వివరించారు.

  • Loading...

More Telugu News