: నా పెదాలు బాగానే ఉన్నాయి... సర్జరీ అవసరం లేదు: హాలీవుడ్ నటి
మేకప్ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని రియాలిటీ షో స్టార్ కెల్లీ జెన్నర్ స్పష్టం చేసింది. వచ్చే నెలలో ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి పోజిచ్చేందుకు గాను పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే పుకార్లను ఆమె ఖండించింది. 'ప్రస్తుతం నాకు ఆ కోరిక లేదు. నా పెదాలు పెద్దవిగా కనిపిస్తున్నా మేకప్ తో కవర్ చేస్తున్నా. ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత అయితే ఇంకా రాలేదు' అని స్పష్టం చేసింది. రియాలిటీ టీవీ స్టార్ గా యూఎస్ లో జెన్నర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. శరీరాకృతిని కాపాడుకోవడంతో పాటు మేకప్ ఎలా వేసుకోవాలి? అనే అంశాలపై అవగాహన కారణంగానే తాను గతంలో కంటే మరింత నాజూగ్గా కనబడుతున్నానని జెన్నర్ తెలిపింది.