: కోడిపందాలపై సుప్రీం విచారణ రేపటికి వాయిదా


సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్రాలో జోరుగా సాగే కోడి పందాలకు సంబంధించి నెలకొన్న వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలంటూ బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోడి పందాలపై ప్రభుత్వ ఉత్తర్వులను తమ ముందుంచాలని కోర్టు, ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించిన తర్వాత రేపు సుప్రీంకోర్టు కోడి పందాలపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

  • Loading...

More Telugu News