: నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు ఎంపీ గుత్తా సూచన


కాంగ్రెస్ పాలనలో అభివృద్ధే జరగలేదని, నేతలంతా ఒళ్లు పెంచారంటూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడటంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ నోరు పారేసుకోవద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని సూచించారు. నాటి కాంగ్రెస్ మంత్రులపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. గతంలో ఆమరణ దీక్షలో ఉన్న కేసీఆర్ ప్రాణాలు కాపాడేందుకే సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేశారని గుర్తు చేశారు. కాగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా అదనంగా గ్రామాలకు చుక్క తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టాలని గుత్తా చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నుంచే వలసలు ప్రోత్సహించడం కేసీఆర్ కు పాపమన్నారు.

  • Loading...

More Telugu News