: 'రాత్ గయీ, బాత్ గయీ'... క్షమాపణ చెప్పేది లేదన్న సాక్షి మహారాజ్


ప్రతి హిందూ మహిళా నలుగురు పిల్లలను కనాలని వ్యాఖ్యానించిన బీజేపీ నేత సాక్షి మహారాజ్ తను క్షమాపణ చెప్పే పనే లేదని స్పష్టం చేశారు. 'రాత్ గయీ, బాత్ గయీ' (నిన్నటి విషయం నిన్ననే ముగిసింది) అన్న ఆయన తను రాజకీయ సభలో అలా మాట్లాడలేదని, అది ఓ మతపరమైన సమావేశమని తెలిపాడు. నెలరోజుల క్రితం ఇదే సాక్షి మహారాజ్ గాంధీని హత్య చేసిన గాడ్సే ను దేశ భక్తుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో మోదీ సైతం ఒకింత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News