: ప్రధాని మోదీని కలిసిన సోనాక్షి సిన్హా


బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. తల్లిదండ్రులతో కలిసి మోదీ నివాసానికి వెళ్లిన సోనాక్షి సిన్హా, మోదీకి ఓ గిఫ్ట్ ప్యాకెట్ ను కూడా అందజేసింది. ప్రధాని మోదీ అంటే బాలీవుడ్ నటులకు భలే క్రేజీ అన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నుంచి వివేక్ ఒబెరాయ్ దాకా అందరూ మోదీతో కలిసేందుకు అమితాసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే సోనాక్షి సిన్హా కూడా మోదీని కలిసి ఓ సెల్ఫీ కూడా తీసుకుంది. బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా, పూనమ్ సిన్హాల గారాలపట్టి అయిన సోనాక్షి సిన్హా నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలవగలిగారు. ఇటీవల రిలయన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మోదీతో బాలీవుడ్ ప్రముఖులు సెల్ఫీలకు ఎగబడ్డారు. సోనాక్షి సిన్హా తనను కలిసిన విషయాన్ని మోదీనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. సోనాక్షి సిన్హా, ఆమె కటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను మోదీ ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.

  • Loading...

More Telugu News