: కవిత ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన!


జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండటం, ఆమె కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కవిత రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. రక్త పరీక్షల నివేదిక నేటి సాయంత్రానికి రావచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News