: వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య డెబ్బై కోట్లు
ప్రముఖ మెసేజ్ సర్వీస్ నెట్వర్క్ వాట్స్ యాప్ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ఆ సైట్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య 70 కోట్లకు చేరిందని సంస్థ సీఈవో జాన్ కూమ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు నిత్యం మూడువేల కోట్ల సందేశాలు పంపుతున్నారని, ఈ క్రమంలో వాట్స్ యాప్ అతి పెద్ద సామాజిక నెట్వర్క్ గా అవతరించిందని వాషింగ్టన్ లో మీడియాకు వివరించారు. కాగా వాట్స్ యాప్ నెట్వర్క్ రూ.1.18 లక్షల కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతోందని చెప్పారు. 130 కోట్ల మంది వినియోగిస్తున్న ఫేస్ బుక్ ఇప్పటికీ అగ్ర స్థానంలో ఉందన్నారు. ఇన్ స్టాగ్రమ్, ట్విట్టర్ లు 30 కోట్లు, 28.4 కోట్ల వినియోగదారులతో తరువాత స్థానాలను ఆక్రమించాయని చెప్పారు.