: మహ్మద్ ప్రవక్తను కించపరిస్తే ఎవరికైనా చావుతప్పదంటున్న బీఎస్పీ నేత
ఫ్రాన్స్ లో చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు రూ.51 కోట్లు ఇస్తానని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) నేత హాజీ యాకూబ్ ఖురేషి ప్రకటించారు. ఆయన 2006లోనే దీనిపై రూ.51 కోట్ల రివార్డు ప్రకటించారు. చార్లీ హెబ్డో మ్యాగజైన్ లో ప్రచురితమైన కార్టూన్ మహ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా ఉందని, ఆ కార్టూనిస్టును చంపినవారికి రివార్డు ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు, ఆ పత్రిక సిబ్బందిని చంపినవారికి రివార్డు అందస్తానంటూ తాజా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చార్లీ హెబ్డో పత్రిక తీరును తప్పుబట్టారు. ఆ పత్రిక ఇస్లాంను పదేపదే అవహేళన చేస్తోందని ఆరోపించారు. అందుకే దాడులు జరిగాయన్నారు. మహ్మద్ ప్రవక్త పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించే ఎవరికైనా చావు తప్పదని తీవ్ర వ్యాఖ్య చేశారు.