: వీహెచ్ పీ మ్యాగజైన్ కవర్ పేజ్ పై కరీనా కపూర్ ఖాన్ మార్ఫింగ్ ఫోటో
లవ్ జిహాద్, మత మార్పిళ్లపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తమదైన శైలిని అనుసరిస్తూనే ఉంది. తాజాగా వీహెచ్ పీ తన 'హిమాలయ వాహిని' మ్యాగజైన్ కవర్ పేజీపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ఫోటోను మార్ఫింగ్ చేసి వేసింది. సగానికి సగం ఆమె ముఖానికి ముసుగు కప్పి ఉంది. 'లవ్ జిహాద్', ముస్లిం పురుషుడిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను తిరిగి మతం మార్చడం వంటి సమస్యల పరిష్కారం అని ఫోటో కింద పేర్కొంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న కరీనా ఓ సెలబ్రిటీ కూడా. ఈ విషయంలో ఆమెను కొంతమంది కూడా అనుసరించవచ్చని, అందుకే ఉదాహరణగా ఆమెను చూపినట్టు తెలుస్తోంది. అయితే వీహెచ్ పీ పత్రిక కవర్ పేజ్ పై తన ఫొటో వస్తుందని కరీనా ఊహించి ఉండకపోవచ్చు.