: యువీని ఆ విధంగా పెంచలేదు: తండ్రి యోగ్ రాజ్


వరల్డ్ కప్ కు జట్టులో చోటు దక్కనంత మాత్రాన యువరాజ్ సింగ్ కుంగిపోడని అతని తండ్రి యోగ్ రాజ్ సింగ్ అన్నారు. సెలక్టర్ల నిర్ణయం యువీపై ప్రభావం చూపబోదని అభిప్రాయపడ్డారు. ఛండీగఢ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. "యువరాజ్ మంచులా కరిగిపోయే వ్యక్తి కాదు. నేను మా అబ్బాయిని ఆ విధంగా పెంచలేదు. గట్టివాడు యువీ. ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోవడం తెలిసినవాడు" అని వివరించారు. అతనిలో ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటుందని తెలిపారు. జట్టులో చోటు దక్కనందుకు తాను ఏమీ బాధపడడంలేదని, ఛండీగఢ్ వచ్చి వెంటనే ప్రాక్టీసు మొదలుపెడతానని యువీ తనతో చెప్పినట్టు యోగ్ రాజ్ సింగ్ పేర్కొన్నారు. మాజీ క్రికెటర్ అయిన యోగ్ రాజ్ పలు సినిమాల్లోనూ నటించారు.

  • Loading...

More Telugu News