: పనితీరేమీ బాగోలేదు: ఏపీ పోలీసులపై సీఎం చంద్రబాబు అసహనం


ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా ఏ ఒక్కరి పనితీరు కూడా బాగాలేదని ఆయన అన్నారు. ఆశించిన మేర ఫలితాలను రాబట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పలు విషయాల్లో ప్రభుత్వ సంకల్పాన్ని తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘రాజధాని’ అగ్నిప్రమాద విచారణకు సంబంధించి అనుమానితుల పేరిట రైతులను వేధింపులకు గురిచేస్తే ఎట్లాగంటూ గుంటూరు రూరల్ ఎస్పీ రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఇసుక రీచ్ లు, ఇంటెలిజెన్స్ వ్యవహారాలకు సంబంధించి ఐజీ అనురాధపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో తనను కలిసేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులను గేటు వద్దే నిలబెట్టిన తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News