: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్పందన
హిందుత్వాన్ని పరిరక్షించేందుకు ప్రతి హిందూ స్త్రీ నలుగురు పిల్లల్ని కనాలంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు విక్రమ్ భట్, "హిందూ మహిళలందరూ నలుగురు పిల్లల్ని కనాలని చెబుతున్నారు. అది మంచి విషయమే. కానీ ఎంతమంది భర్తలు అన్నది చెప్పలేదు" అని ఎద్దేవా చేశారు. సంగీత దర్శకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడు విశాల్ దద్లానీ మాట్లాడుతూ, "అభివృద్ధికి బీజేపీ అర్థం అంటే ఏమిటో ఇప్పటికి నాకు తెలిసింది. నూతన అభివృద్ధి మూర్ఖత్వంగా ఉంది. దానివల్ల ప్రతిరోజూ జాతి అతిగా వ్యాప్తి అవుతోంది" అని విమర్శించారు. కమెడియన్ వీర్ దాస్ ఈ విషయంపై ట్విట్టర్ లో పేర్కొంటూ "ప్రియమైన సాక్షి మహారాజ్ గారూ, చాలా కాలం నుంచి ఒక్క బిడ్డ ఉన్న ప్రతి ఒక్క హిందూ స్త్రీ మీ ప్రసంగం చూసి నవ్వుకుంటుంది. అయితే మేం బాగానే ఉన్నాం" అని చెప్పారు. ఇలా ఎంపీ వ్యాఖ్యలపై పలువురు తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు.