: సంజయ్ దత్ పెరోల్ పొడిగించేందుకు నిరాకరణ... నేడు జైలుకు బాలీవుడ్ హీరో
అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తూ, సెలవుపై బయటకు వచ్చిన హీరో సంజయ్ దత్ నేడు మళ్ళీ జైలుకు బయలుదేరారు. ఆయన 14 రోజుల పెరోల్ పై గత నెల 24న బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన సెలవును పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిరాకరించారు. జైలు నుంచి పలుమార్లు పెరోల్ పై ఆయన బయటకు వస్తుండటంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ, 18 నెలల జైలు శిక్షను అనుభవించిన దత్ మరో 42 నెలలు జైలులో గడపాల్సివుంది.