: నవ్యాంధ్ర రాజధానిలో నేడు వైసీపీ పర్యటన... సర్వత్రా ఉత్కంఠ!


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు నేడు పర్యటించనున్నారు. రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తూ, వారి భూములను బలవంతంగా సేకరిస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు బాధిత రైతులకు మద్దతుగా నిలిచేందుకే ఈ పర్యటన జరుపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ పర్యటనకు సిద్ధమైంది. పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఒత్తిడికి గురవుతున్న రైతులను కమిటీ సభ్యులు పరామర్శించనున్నారు. రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, నిడమర్రుల్లో కమిటీ పర్యటించనుంది. ఓ వైపు ప్రభుత్వం భూములను సమీకరిస్తుండగా, మరోవైపు వైసీపీ నేతల పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News