: ఐఐటియన్ల ఘనత... రెండేళ్ళ వెబ్ సైట్ విలువ పదిహేను వందల కోట్ల రూపాయలు


అదొక వెబ్ సైట్. కేవలం రెండేళ్ళ క్రితమే ప్రారంభమైంది. నిర్మాణ రంగంలో సేవలందిస్తున్న ఈ వెబ్ సైట్ విలువ ఇప్పుడు రూ.1500 కోట్లు. హౌసింగ్ డాట్ కామ్ పేరిట భారత ఇ-కామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న సంస్థలో జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు రూ.570 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. "మేము కేవలం నిజమైన ఫొటోలను వెబ్ సైట్లో ఉంచడమే మా విజయ లక్ష్యం. దానివల్లే చాలామంది మాకు కస్టమర్లుగా మారారు" అంటున్నాడు ఐఐటీ చదివి హౌసింగ్ డాట్ కాం స్థాపించిన అద్వితీయ శర్మ. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ ను చూసేందుకు ప్రతి రోజు 80 వేలకు పైగా కొత్త విజిటర్స్ వస్తున్నారు. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 1500 మంది ఉద్యోగులతో ఈ సంస్థ విస్తరిస్తోంది.

  • Loading...

More Telugu News