: త్యాగం కాదిది... మాకు మాత్రమే దక్కిన భాగ్యం: టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్


తన కుమారుడు ఎంతో విశిష్టత కలిగిన శృంగేరి శారదాపీఠం వారసుడిగా ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోందని, జగన్మాత చల్లని కరుణతోనే ఈ అదృష్టం వరించిందని టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్, ఎస్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ వేదిక్ స్టడీస్ ప్రాజెక్ట్ అధికారి కుప్పా శివ సుబ్రమణ్యఅవధాని తెలిపారు. ఈడొచ్చిన మగపిల్లవాడికి వివాహం జరిపించి మనుమలు, మనవరాళ్లతో ఆడుకోవాలని అనిపించే వయసులో కొడుకు సన్యాసం స్వీకరించాల్సిన పరిస్థితిపై ఆయన్ను ప్రశ్నించగా, "ఇది త్యాగం కాదు. మాకు మాత్రమే దక్కిన భాగ్యం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శృంగేరి శారదాపీఠం అధిపతి నా కొడుకు వెంకటేశ్వర ప్రసాద్ ను ఎంచుకోవడం నిజంగా పూర్వ జన్మ సుకృతం" అని అవధాని ఎంతో భావోద్వేగంతో చెప్పారు. కాగా, అవధానికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట కౌండిన్య ముంబయిలోని రిలయన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కౌండిన్యకు వచ్చేనెల 22వ తేదీన వివాహం జరిపించాలని నిర్ణయించామని, ఈలోగా రెండో కుమారుడిని భారతీ తీర్థ స్వామి కరుణించారని ఆయన అమితానందం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News