: లోకేశ్ శతకం... కోహ్లీ హాఫ్ సెంచరీ: పరుగులు పెడుతున్న టీమిండియా స్కోరు బోర్డు
టీమిండియా యువ సంచలనం లోకేశ్ రాహుల్ (106) తన రెండో టెస్టులోనే అదరగొట్టాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన లోకేశ్ రాహుల్, ఇద్దరు సీనియర్లు మురళీ విజయ్ (0), రోహిత్ శర్మ (53)లు తడబడ్డా, బెణకకుండా శతకం సాధించాడు. 98 పరుగుల వద్ద నిర్భయంగా బ్యాట్ ఝుళిపించిన లోకేశ్ ఫోర్ తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న లోకేశ్ 12 ఫోర్లు, ఓ సిక్స్ తో 106 పరుగులు రాబట్టాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ (67) కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరి సూపర్ ఇన్నింగ్స్ తో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. 85 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 234 పరుగులు చేసింది.