: తిరుమలేశుడి దయతోనే బతికి బయటపడ్డా: బీజేపీ నేత మురళీధరరావు


తిరుమల వెంకన్న దయతోనే అనారోగ్యం నుంచి బయటపడ్డానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న క్రమంలో మురళీధరరావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెనువెంటనే ఆయనను తిరుపతిలోని అశ్విని ఆస్పత్రిలో చేర్పించిన ఆయన అనుచరులు ఆ తర్వాత స్విమ్స్ లో చేర్చారు. స్విమ్స్ లో చికిత్స తీసుకున్న ఆయన బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వెంకన్న దయతోనే తాను బతికి బట్టకట్టానని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. యాంజియోగ్రామ్ కోసం ఆయన హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News