: తిరుమల ఖాళీ... రెండు గంటల్లోనే దర్శనం!
గత రెండు వారాలుగా కిటకిటలాడిన తిరుమల గిరులు భక్తుల రాక తగ్గడంతో బోసిపోయాయి. ఈ ఉదయం 9 గంటల సమయంలో కేవలం 3 కంపార్ట్ మెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచివున్నారు. వీరికి 2 నుంచి 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు 2 గంటల్లోపే దర్శనం పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అద్దెగదులు సులభంగా లభిస్తున్నాయి. మరో వారంలో సంక్రాంతి పర్వదినం రానుండటంతో భక్తుల రాక తగ్గిందని తెలుస్తోంది.