: కర్నూలు జిల్లాలో ‘ఫ్యాక్షన్’ దాడి... ‘కాంగ్రెస్’ వేట కొడవళ్ల దాడిలో తెదేపా కార్యకర్తకు గాయాలు
కర్నూలు జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్ పడగ విప్పింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాంపల్లిలో టీడీపీ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు నేటి ఉదయం విరుచుకుపడ్డారు. వేటకొడవళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిలో టీడీపీ కార్యకర్త సుధాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరిన సుధాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మరిన్ని గొడవలు జరగకుండా పికెట్ ను ఏర్పాటు చేశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు క్రమంగా పెరిగాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ దాడులు నమోదయ్యాయి.