: విరిగిన ముందు చక్రాలు... ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం!


ఓ 'పల్లెవెలుగు' బస్సు త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడు వద్ద ఒక ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగి పోయాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతతో సడన్ బ్రేకు వేసి బస్సును ఆపివేశాడు. ఆ సమయంలో బస్సులో 50 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను వేరొక బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు.

  • Loading...

More Telugu News