: టీఆర్ఎస్ ఎంపీ కవిత రక్తనమూనాల పరీక్ష... పరామర్శల వెల్లువ


జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ ఎంపీ కవిత రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్టు వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, కవితను పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున వస్తుండటంతో ఆసుపత్రి వద్ద సందడి నెలకొంది. అయితే ముఖ్యులను తప్ప లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌ కుమార్ తదితరులు ఆమెను పరామర్శించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు.

  • Loading...

More Telugu News