: తెలంగాణ ఐపీఎస్ లకు లగ్జరీ 'ఫార్చ్యూనర్' కార్లు


తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖ స్థితిగతులు మారిపోయాయి. తాజాగా ఐపీఎస్ లకు విలువైన, లగ్జరీ ఫార్చ్యూనర్ కార్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా ఎస్సీ స్థాయి నుంచి డీజీపీ వరకు అందరికీ ఫార్చ్యూనర్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డీజీపీ అనురాగ్ శర్మ ఫార్చ్యూనర్ ను వినియోగిస్తుండగా... మరో నెల రోజుల్లో దాదాపు 70 మంది ఐపీఎస్ లకు అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాకుండా, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు కూడా కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోలింగ్ నిర్వహణకు 426 సుమోలు, 256 బొలెరోలను పోలీసు శాఖ కొనుగోలు చేసింది. మరో రెండు రోజుల్లో ఈ వాహనాలు జిల్లాలకు చేరనున్నాయి.

  • Loading...

More Telugu News