: ‘సీమ’ జైలు నుంచి మరో ఖైదీ పరార్... పరుగులు పెడుతున్న పోలీసులు!


రాయలసీమలోని జైలు అధికారులు మరోమారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొన్నటికి మొన్న హత్య కేసులో నిందితుడు సునీల్ జైలు మారుతున్న సమయంలో పరారైన నేపథ్యంలో ఉన్నతాధికారుల నుంచి అక్షింతలేయించుకున్న జైలు సిబ్బంది, తాజాగా మరోమారు పోలీసు బాసుల నుంచి శ్రీముఖాలు అందుకోనున్నారు. అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలులో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దస్తగీర్ అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అనంత ఓపెన్ ఎయిర్ జైలు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలిస్తున్న క్రమంలో అతడు పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు దస్తగీర్ కోసం వేట ప్రారంభించారు.

  • Loading...

More Telugu News