: రెబల్ స్టార్ పర్సు కొట్టేశారు!


టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పర్సు పోగొట్టుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కృష్ణంరాజు పర్సును చోరులు కొట్టేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల పార్టీ శాఖలను బలోపేతం చేసే దిశగా ఆయా రాష్ట్రాల పదాధికారుల సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షాకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, అమిత్ షాకు స్వాగతం పలికేందుకు రెండు రాష్ట్రాల నేతలు పోటీలు పడ్డారు. ఈ క్రమంలోనే చోరులు తమ చేతివాటంతో కృష్ణంరాజు పర్సును కొట్టేశారు. చోరులు కొట్టేసిన పర్సులో విలువైన క్రెడిట్ కార్డులతో పాటు నగదు కూడా ఉందని కృష్ణంరాజు చెప్పారు.

  • Loading...

More Telugu News