: ఈ నెల 17న విశాఖలో ఐఐఎంకు శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా


ఈ నెల 17న ఐఐఎంకు విశాఖలో శంకుస్థాపన జరగనుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఐఐఎంకు భూములిచ్చే నేతలతో సమావేశమైన సందర్భంగా విశాఖలో ఆయన మాట్లాడుతూ, ఐఐఎం శంకుస్థాపనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారని అన్నారు. ఎంసెట్ వివాదంపై ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా హైదరాబాదులో చదవాలనుకునే విద్యార్థులు రెండు సార్లు ఎంసెట్ రాయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకే పరీక్షకు రెండు సార్లు హాజరుకావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News