: దాడుల హెచ్చరికల నేపథ్యంలో ముంబైలో పటిష్ట భద్రత
ముంబైకి ఉగ్రదాడుల నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 10న ముంబై శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు చేస్తామని రెండో టెర్మినల్ టాయిలెట్ గోడలపై ఐఎస్ఐఎస్ పేరిట కొందరు రాసి హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దానికి తోడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశీయులను ముంబై వెళ్లవద్దంటూ హెచ్చరించిన నేపథ్యంలో, విమానాశ్రయంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంతంతో పాటు కీలకమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు.