: సంక్రాంతికి తెలంగాణలో వారం రోజుల సెలవులు
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. గతంలో పండగ మూడు రోజులు మాత్రమే సెలవు అన్న ప్రభుత్వం ఇప్పుడు వారం రోజులు ప్రకటించింది. దీంతో ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముందు వస్తున్న ఆదివారంతో కలుపుకుని 8 రోజుల పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు వచ్చినట్లయింది. కాగా, కొన్ని కార్పొరేట్ కళాశాలలు వారం రోజుల సెలవులకు సంబంధించిన ప్రాజెక్టు వర్కులు ఇచ్చినట్టు సమాచారం.