: ఇలా చేస్తే ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది: డాట్


మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించే దిశగా ఆయా కంపెనీలకు 15 ఏళ్ల పాటు పన్నుపరమైన మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర టెలికం విభాగం (డాట్) ప్రతిపాదించింది. విలువ ఆధారిత పన్నులనూ (వ్యాట్) తక్కువ స్థాయిలో ఉంచాలని పేర్కొంది. వియత్నాంలో తయారీ రంగానికి 30 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే అమలు చేస్తున్నట్టు, భారత్ లో కూడా అలాంటి విధానమే అమలు చేయాలని డాట్ ఇన్వెస్ట్‌ మెంట్ సెల్, ఆర్థిక శాఖకు సూచించింది. ఇప్పుడు అమలు చేస్తున్న 8.8-15 శాతం వ్యాట్‌ ను 4 లేదా 5 శాతానికి తగ్గించాలని పేర్కొంది. అలా చేస్తే మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని డాట్ తెలిపింది. పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కల్పించేలా ఆదాయపు పన్ను చట్టంలోని 35 ఏడీ నిబంధన పరిధిలోకి మొబైల్ ఫోన్లను, ట్యాబ్లెట్ల తయారీ సంస్థలను కూడా తీసుకురావాలని సూచించింది.

  • Loading...

More Telugu News