: రాకెట్ లాంచర్లు, తుపాకులతో దాడులు...పత్రికా కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలి: ఫ్రాన్స్ ప్రభుత్వం


ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదులు రాకెట్ లాంఛర్లు, ఏకే 47 తుపాకులు, అత్యాధునిక మిషన్ గన్లతో విరుచుకుపడ్డారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా ఉగ్రవాదుల కుట్రలను అడ్డుకుంటున్నామని, ఫ్రాన్స్ లోని అన్ని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశాధ్యక్షుడు తెలిపారు. పత్రికా కార్యాలయంలోకి ప్రశాంతంగా వెళ్లిన ఉగ్రవాదులు ఎలాంటి అలజడి లేకుండా తుపాకులతో కాల్పులకు దిగారని, రాకెట్ లాంఛర్లు ప్రయోగించడంతో పది మంది మరణించారని, పారిపోతూ రోడ్డుమీద ఉన్న వారిపై కూడా కాల్పులకు దిగారని ఆయన వెల్లడించారు. జరిగిన దాడిన ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, ప్యారిస్ లోని పత్రికా కార్యాలయంపై దాడులను ఖండిస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News