: సిగరెట్ కోసం కత్తితో బెదిరింపులు...ముగ్గురి అరెస్ట్
హైదరాబాదులో సిగరెట్ కోసం జరిగిన గొడవలో కత్తితో బెదిరించి ముగ్గురు యువకులు కలకలం సృష్టించారు. మెహదీపట్నంలోని ఆసిఫ్ నగర్ వెంకమ్మతోట బస్తీ సమీపంలోని ఓ కిరణాషాప్ వద్దకు మంగళ్ హాట్ ఫీల్ ఖానాకు చెందిన రాహుల్ (20) సిగరెట్ కొనేందుకు వచ్చాడు. ఈ క్రమంలో షాప్ యజమాని నవీన్ తో గొడవ పడ్డాడు. షాప్ యజమానికి తన హీరోయిజం చూపాలని భావించిన రాహుల్ తన స్నేహితులు అబ్దుల్ మన్నాన్, జాకీర్ లను పిలిచాడు. నవీన్ తో మరోసారి గొడవపడి కత్తితో బెదిరించాడు. దీంతో నవీన్ పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.